భువనగిరి మైనార్టీ గురుకులంలో విషాదం: ఫాంపాండ్‌లో మునిగి పదో తరగతి విద్యార్థి మృతి


భువనగిరి శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది. హాస్టల్ సమీపంలోని ఫాంపాండ్‌లో ఈతకు వెళ్లిన బాలఆకాష్‌ (16) అనే విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాల సిబ్బంది పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘోరం జరిగిందని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భువనగిరి ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. మరో విద్యార్థి అస్వస్థతకు గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.