
మిర్యాలగూడ పురపాలక సంఘానికి నూతన పాలకవర్గం కొలువుదీరింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ చైర్మన్గా చిలుకూరి సుధా, వైస్ చైర్మన్గా గుడిపాటి శిరీష ఎన్నికయ్యారు. అనంతరం నూతన కౌన్సిలర్లతో కలిసి వీరు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.

