చెర్వుగట్టులో శివనామ జపం.. భక్తజన సంద్రమైన పార్వతీ జడల రామలింగేశ్వర క్షేత్రం!

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా, కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య దర్శనాలు ప్రశాంతంగా సాగాయి.