మార్చి 3న 10 గంటల పాటు మూతపడనున్న శ్రీవారి ఆలయం!

చంద్రగ్రహణం ప్రభావంతో మార్చి 3న శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. గ్రహణ శాంతి అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని పునఃప్రారంభిస్తారు. అదే రోజు కుమారధార తీర్థ ముక్కోటి సందర్భంగా భక్తులకు పరిమిత సమయం (ఉదయం 5-9 గంటలు) మాత్రమే అనుమతి ఉంటుంది.