ఎంజీయూ విద్యార్థుల ప్రతిభావైభవం: వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందనలు

నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ తెలుగు శాఖ విద్యార్థులు జాతీయ స్థాయి అర్హత పరీక్ష (UGC-NET)లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, పరిశోధన (PhD) రంగంలో ప్రవేశాలు పొంది రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ సాహిత్య సదస్సులలో పత్ర సమర్పణ చేసిన విద్యార్థులను వీసీ అభినందిస్తూ, సాహిత్య మరియు సృజనాత్మక రంగాల్లో నిరంతరం కృషి చేస్తూ విశ్వవిద్యాలయానికి పేరు తేవాలని పిలుపునిచ్చారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ‘సీఎం కప్’ జిల్లా స్థాయి క్రీడా పోటీలను అదనపు ఎస్పీ రమేష్ ప్రారంభించారు. ఫుట్‌బాల్, హ్యాండ్ బాల్, నెట్‌బాల్ వంటి క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే కష్టపడే తత్వాన్ని అలవరుచుకోవాలని, క్రీడలు క్రమశిక్షణకు మార్గాలని పేర్కొన్నారు.