
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 4వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 అట్టహాసంగా ప్రారంభమైంది. డీజీపీ శివధర్‌రెడ్డి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి 2,532 మంది క్రీడాకారులు పాల్గొంటున్న ఈ ఈవెంట్‌లో 31 క్రీడా విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. పోలీసుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని డీజీపీ పేర్కొన్నారు.

