
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) వేములపల్లి, తకెళ్ళపాడు గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 3500 ఇళ్లు పూర్తి చేశామని, త్వరలో పట్టణంలో మరో 2500 ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి పథకాలే ప్రజా ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు.

