నల్లగొండ విద్యార్థులకు శుభవార్త: ప్రభుత్వ బడి పిల్లలకు ‘రవాణా భరోసా’.. నెలకు రూ.600 విడుదల!

దూర ప్రాంతాల నుండి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా భత్యం (Transport Allowance) నిధులను విడుదల చేసింది. సమగ్ర శిక్షా అభియాన్ కింద 2025-26 విద్యా సంవత్సరానికి గానూ, ప్రతి విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున జూన్ నుండి మార్చి వరకు నిధులు మంజూరయ్యాయి. మారుమూల గ్రామాల విద్యార్థులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం.