
నల్లగొండ జిల్లా గుర్రంపోడు, కొండమల్లేపల్లి మండలాల్లో రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పర్యటించారు. సేంద్రియ మరియు జీవన ఎరువుల వినియోగంతో బత్తాయి తోటల్లో అద్భుత దిగుబడులు సాధిస్తున్న రైతులను ఆమె అభినందించారు. నాబార్డు సహకారంతో రైతు ఉత్పాదక సంస్థల (FPO) ఏర్పాటు, మార్కెటింగ్ సౌకర్యాల కల్పన మరియు క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు వలంటీర్ల నియామకం వంటి కీలక అంశాలపై ఆమె దిశానిర్దేశం చేశారు.

