తెలంగాణలో క్రీడల పండుగ: గచ్చిబౌలిలో ఘనంగా ప్రారంభమైన ‘సీఎం కప్‌ 2025’ రాష్ట్ర స్థాయి ఫైనల్స్‌!

తెలంగాణ క్రీడా చరిత్రలో సరికొత్త మైలురాయిగా నిలుస్తున్న సీఎం కప్‌ 2025 (రెండో ఎడిషన్) రాష్ట్ర స్థాయి ఫైనల్స్‌ హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఈ వేడుకను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో గెలిచిన 21,500 మంది అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్‌లో తమ ప్రతిభను చాటుకోనున్నారు.