తెలంగాణ TG EAPCET దరఖాస్తుల జోరు: తొలిరోజే 20 వేల మార్కు దాటిన అప్లికేషన్లు!

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG EAPCET 2026 దరఖాస్తుల ప్రక్రియ ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదటి రోజు ముగిసే సమయానికి మొత్తం 20,143 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ఇంజినీరింగ్ విభాగానికి అప్లికేషన్లు వచ్చాయి.