
హైదరాబాద్ నగరాన్ని వణికించిన దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు నేటితో 13 ఏళ్లు నిండాయి. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ ఉగ్రదాడిలో 18 మంది అమాయకులు బలికాగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. NIA కోర్టు దోషులకు మరణశిక్ష విధించినప్పటికీ, అది ఇంకా అమలుకు నోచుకోకపోవడంపై బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ‘న్యాయం జరిగినప్పుడే మృతుల ఆత్మకు శాంతి’ అంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.

