
నల్లగొండ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయం మినీ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 24న ఉదయం 10:30 గంటలకు ఐటీఐ క్యాంపస్లో ప్రారంభమయ్యే ఈ మేళాకు సంబంధించిన వివరాలను జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎన్. పద్మ వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.

