మర్రిగూడలో చైనా మాంజా బలి.. జాతీయ పక్షి నెమలి మృతి!


నిషేధిత చైనా మాంజా మరో ప్రాణాన్ని బలితీసుకుంది. మర్రిగూడ మండలం బట్లపల్లి గ్రామ శివారులో ఆహారం కోసం వచ్చిన ఓ నెమలి కాళ్లకు చైనా మాంజా చుట్టుకోవడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పశువైద్యాధికారి సురేందర్ నెమలికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఖననం చేశారు. పర్యావరణానికి, పక్షులకు హాని కలిగించే మాంజా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.