
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను స్వయం ఉపాధి పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఈ క్రింది విధంగా సబ్సిడీ లభిస్తుంది:
-
టూ వీలర్ (2-Wheeler EV): దీనిపై ఏకంగా 90% సబ్సిడీ లభిస్తుంది. (ఉదాహరణకు: లక్ష రూపాయల బండిపై రూ. 90,000 ప్రభుత్వం భరిస్తుంది, లబ్ధిదారుడు కేవలం రూ. 10,000 చెల్లిస్తే సరిపోతుంది).
-
త్రీ వీలర్ (3-Wheeler EV): ఆటో రిక్షా వంటి ఎలక్ట్రిక్ వాహనాలపై 70% సబ్సిడీ అందించబడుతుంది.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు (Required Documents):
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తుతో పాటు ఈ క్రింది పత్రాలను జతచేయాలి:
-
కుల ధృవీకరణ పత్రం (Caste Certificate – SC)
-
ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)
-
రేషన్ కార్డు (White Ration Card/Food Security Card)
-
డ్రైవింగ్ లైసెన్స్ (Driving License – తప్పనిసరి)
-
ఆధార్ కార్డు మరియు ఫోటోలు.
ముఖ్యమైన తేదీలు & లింక్:
-
దరఖాస్తు ప్రారంభం: మార్చి 18, 2026.
-
చివరి తేదీ: మార్చి 26, 2026.
-
అధికారిక వెబ్‌సైట్: tgobmms.cgg.gov.in

