
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి టీఎంసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. మొత్తం 294 స్థానాలకు గానూ 291 స్థానాల్లో తమ అభ్యర్థులను మమతా బెనర్జీ మంగళవారం ప్రకటించారు (మిగిలిన 3 స్థానాలను మిత్రపక్షం బిజిపిఎంకు కేటాయించారు).
అభ్యర్థుల ఎంపికలో కీలక మార్పులు:
-
74 మందికి ‘నో’ టికెట్: ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో దాదాపు మూడో వంతు మందిని ఈసారి తప్పించారు. వీరిలో మాజీ మంత్రులు పార్థా ఛటర్జీ, మనోజ్ తివారీ వంటి ప్రముఖులతో పాటు కంచన్ మల్లిక్, చిరంజీత్ వంటి నటులు కూడా ఉండటం గమనార్హం.
-
యువతకు పెద్దపీట: సుమారు 45% టికెట్లను 50 ఏళ్ల లోపు వారికే కేటాయించారు. పార్టీ ఐటీ సెల్ చీఫ్ దేబంగ్షు భట్టాచార్య వంటి యువ నాయకులకు ఈసారి అవకాశం దక్కింది.
-
మహిళలు & మైనారిటీలు: 52 మంది మహిళలకు (18%), 47 మంది మైనారిటీ అభ్యర్థులకు చోటు కల్పించారు.
-
స్థానాల మార్పు: 135 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను యథాతథంగా కొనసాగించగా, మరో 15 మందికి నియోజకవర్గాలను మార్చారు.
-
దీదీ పోటీ: మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానిపూర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. అక్కడ బీజేపీ తరపున ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆమెను ఎదుర్కోనున్నారు.
ఎన్నికల షెడ్యూల్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం బెంగాల్లో ఈసారి కేవలం రెండు దశల్లోనే ఎన్నికలు జరగనున్నాయి.
-
మొదటి దశ: ఏప్రిల్ 23, 2026
-
రెండో దశ: ఏప్రిల్ 29, 2026
-
ఫలితాల వెల్లడి: మే 4, 2026

