4 లక్షల కిట్ క్యాట్ చాక్లెట్లు చోరీ – నెస్లే ఫన్నీ రియాక్షన్.

రోమ్/వార్సా: ఇటలీ నుండి పోలండ్ వెళ్తున్న ఒక భారీ ట్రక్కు మార్గమధ్యలో అదృశ్యమైంది. ఆ ట్రక్కులో సాదాసీదా వస్తువులు లేవు.. ఏకంగా 4,13,793 కిట్ క్యాట్ చాక్లెట్ బార్లు ఉన్నాయి. మార్చి 26న జరిగిన ఈ ‘చాక్లెట్ హైస్ట్’ (Chocolate Heist) గురించి నెస్లే (Nestlé) సంస్థ అధికారికంగా ధృవీకరించింది.

జరిగిన కథ ఇదీ:

  • చోరీ స్థాయి: సుమారు 12 టన్నుల బరువున్న ఈ చాక్లెట్ల లోడుతో బయలుదేరిన ట్రక్కు తన గమ్యస్థానానికి చేరుకోలేదు.

  • ప్రత్యేకత: ఈ కన్సైన్‌మెంట్‌లో కిట్ క్యాట్ కొత్తగా లాంచ్ చేసిన ‘ఫార్ములా 1’ (F1) ఎడిషన్ చాక్లెట్లు ఉన్నాయి. ఇవి రేస్ కార్ల ఆకారంలో ఉండి, పర్యాటకుల కోసం యూరప్ మార్కెట్లోకి వెళ్లాల్సి ఉంది.

  • నెస్లే ఫన్నీ రియాక్షన్: ఈ చోరీపై నెస్లే ప్రతినిధి స్పందిస్తూ.. “మేం ఎప్పుడూ ‘హావ్ ఏ బ్రేక్’ (Have a Break) అని చెబుతుంటాం. కానీ దొంగలు మా స్లోగన్‌ను మరీ సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు. ఏకంగా 12 టన్నుల చాక్లెట్లతోనే ‘బ్రేక్’ (Made a break with) తీసుకున్నారు” అని చమత్కరించారు.

  • ట్రేసింగ్: దొంగిలించిన చాక్లెట్లు బ్లాక్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని, అయితే ప్రతి చాక్లెట్ పైన ఉన్న బ్యాచ్ కోడ్ (Batch Code) ద్వారా వాటిని సులభంగా గుర్తించవచ్చని కంపెనీ తెలిపింది.