బంగారం ధరల ‘యూ-టర్న్’!: ఉదయం పెరిగి.. సాయంత్రానికి తగ్గిన పసిడి రేట్లు – హైదరాబాద్‌లో తులం బంగారంపై రూ.600 వరకు తగ్గింపు.. వెండి స్థిరం!

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు నేడు మార్కెట్ ముగిసే సమయానికి స్వల్పంగా తగ్గాయి. ఉదయం ఆరంభంలో భారీ లాభాలతో మొదలైన పసిడి, సాయంత్రం బులియన్ ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా కిందికి దిగివచ్చింది.

తాజా ధరల వివరాలు (March 31, Evening):

  • 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ఉదయంతో పోలిస్తే రూ.600 తగ్గి ప్రస్తుతం రూ.1,48,690 వద్ద కొనసాగుతోంది.

  • 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ఆభరణాల తయారీలో వాడే ఈ పసిడిపై రూ.550 తగ్గి రూ.1,36,300 కు చేరింది.

  • వెండి ధర: వెండి ధరలో పెద్దగా మార్పు లేదు. కిలో వెండి రూ.2,50,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

ధరల తగ్గుదలకి కారణాలు: అంతర్జాతీయ మార్కెట్‌లో లాభాల స్వీకరణ (Profit booking) జరగడం, డాలర్ ఇండెక్స్ స్వల్పంగా బలపడటంతో దేశీయ మార్కెట్‌లో పసిడి రేట్లు తగ్గాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఈ తగ్గుదల తాత్కాలికమే కావచ్చని అంచనా వేస్తున్నారు.