
హైదరాబాద్: ఐటీ కారిడార్‌లోని అత్యంత రద్దీగా ఉండే సైబర్ టవర్స్ (Cyber Towers) జంక్షన్ వద్ద మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల ఒక ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఉదయం రద్దీ సమయంలో (Peak Hours) ఒక గంట పాటు వాహనాల రాకపోకలను పర్యవేక్షించగా.. రోడ్లు ఎందుకు స్తంభిస్తున్నాయో స్పష్టమైంది.
సర్వేలో వెల్లడైన గణాంకాలు:
-
సింగిల్ రైడర్లు (Single Riders): కేవలం ఒక గంటలోనే ఏకంగా 10,138 మంది వాహనదారులు తమ కార్లు లేదా బైక్‌లపై ఒంటరిగా ప్రయాణిస్తూ సైబర్ టవర్స్ దాటి వెళ్లారు.
-
డబుల్ రైడర్లు (Double Riders): ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్న వాహనాల సంఖ్య కేవలం 3,584 మాత్రమే ఉంది.
-
ప్రభావం: ఒకే కారులో నలుగురు వెళ్లాల్సిన చోట, నలుగురు నాలుగు వేర్వేరు కార్లలో రావడం వల్ల రోడ్డుపై స్థలం తగ్గిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది.

