ప్రజాశక్తి-ఒంగోలుబ్యూరో : ఒకపక్క రొయ్యల ధర పతనం అవుతుండగా, మరో పక్క రొయ్యల మేత ధర పెరుగుతోంది. దీంతో, రొయ్య రైతులకు చెంపదెబ్బ, గోడదెబ్బ తగిలినట్టయింది. రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగవుతున్నాయి. ఏటా సీజన్లో 11 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా రొయ్యల సాగు ఉంది. తీరప్రాంతంలో పెద్ద ఎత్తున రొయ్యలను సాగు చేస్తున్నారు. 80 శాతం విదేశాలకు ఎగుమతులతో ఈ రంగం అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నెల రెండో తేదీ వరకూ వంద కౌంట్ రొయ్యల ధర కిలో రూ.270 ఉండేది. ప్రస్తుతం ఈ ధర ఇప్పుడు రూ.250కు పడిపోయింది. మిగతా కౌంట్ల ధరలూ తగ్గాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 45 శాతం అమెరికాకు ఎగుమతి పూర్తి వార్త కొరకుhttps://prajasakti.com/special/shrimp-prices-fall
Related Posts
నల్లగొండ ఎన్నికల ఖర్చులో చేతివాటం: ఆడిట్ లేకపోవడంతో లక్షల రూపాయల దుర్వినియోగం?
నల్లగొండ జిల్లాలో ఎన్నికలు ముగిసిన తరుణంలో ఖర్చుల లెక్కలపై దుమారం రేగుతోంది. సరైన ఆడిట్ వ్యవస్థ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు అధికారులు ఎన్నికల నిర్వహణ నిధులను…
మీ ఆధార్ కార్డ్ వివరాలు ఇతరులకు ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! చిన్న పొరపాటుతో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!
హైదరాబాద్: నేటి డిజిటల్ యుగంలో ఆధార్ కార్డ్ (Aadhaar Card) కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు.. అది మన ఆర్థిక, వ్యక్తిగత లావాదేవీలకు కీలక…
నాగార్జునసాగర్ విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం.
| నాగార్జునసాగర్: ఉమ్మడి నల్గొండ మరియు పల్నాడు జిల్లాల సరిహద్దులోని నాగార్జునసాగర్‌లో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ పచ్చజెండా ఊపింది. కేంద్ర మంత్రి కింజరాపు…

