
లండన్: ప్లాస్టిక్ కాలుష్యం నేల, నీటిని విషతుల్యం చేస్తున్న తరుణంలో, ఇంగ్లండ్‌కు చెందిన ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. మనం పారేసే ప్లాస్టిక్ సీసాల (PET Bottles) రసాయన నిర్మాణంలో ఉండే కార్బన్ అణువులను ఉపయోగించి, వృద్ధులను వేధించే పార్కిన్సన్ వ్యాధి చికిత్సకు వాడే ‘లెవోడోపా’ (Levodopa) మందును తయారు చేయవచ్చని వీరు కనుగొన్నారు.
పరిశోధనలోని ముఖ్యాంశాలు:
-
జన్యు మార్పిడి బ్యాక్టీరియా: ఈ ప్రక్రియలో శాస్త్రవేత్తలు ‘ఈ-కోలి’ (E-coli) అనే సూక్ష్మక్రిమిని జన్యు మార్పిడి ద్వారా అభివృద్ధి చేశారు. ఇది ప్లాస్టిక్ వ్యర్థాల్లోని కార్బన్‌ను సేకరించి ఔషధంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
-
ఖర్చు తగ్గుతుంది: ప్రస్తుతం లెవోడోపా మందును తయారు చేయడానికి శిలాజ ఇంధనాలను వాడటం వల్ల పర్యావరణానికి నష్టం జరగడమే కాకుండా, తయారీ ఖర్చు కూడా అధికంగా ఉంటోంది. ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా చేసే ఈ ప్రక్రియ పర్యావరణ హితంగా ఉండటంతో పాటు అత్యంత చౌకగా మందులను అందుబాటులోకి తెస్తుంది.
-
కార్బన్ వనరు: ప్లాస్టిక్ కేవలం చెత్త మాత్రమే కాదు, అందులో బంధితమైన కార్బన్ అణువులను విలువైన ఔషధాల తయారీకి వనరుగా వాడుకోవచ్చని నేచర్ సస్టయినబిలిటీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ కథనం స్పష్టం చేసింది.

