
అక్రమాల వివరాలు:
-
కొనుగోలు ధర: గత ఖరీఫ్ సీజన్లో మార్క్ఫెడ్ రైతుల నుంచి క్వింటాలుకు రూ. 2,400 మద్దతు ధర చొప్పున మొత్తం 3.97 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేసింది.
-
విక్రయ ప్రయత్నం: రైతుల నుంచి రూ. 2,400కు కొన్న మక్కలను, బల్క్ టెండర్ల ద్వారా బడా సంస్థలకు కేవలం రూ. 1,400 నుంచి రూ. 1,500 లోపే (అంటే క్వింటాలుకు రూ. 1,000 నష్టానికి) విక్రయించేందుకు ప్రయత్నాలు జరిగాయి.
-
టెండర్ల రద్దు: గోదాముల వారీగా చిన్న వ్యాపారులు రూ. 1,600 నుంచి రూ. 1,700 వరకు ఇచ్చేందుకు సిద్ధపడినా, పౌల్ట్రీ రైతులు రూ. 1,600కు కొంటామని ముందుకు వచ్చినా అధికారులు ఆ టెండర్లను రద్దు చేసి బల్క్ టెండర్లకు వెళ్లారు.
-
పెట్టుబడి: ఈ మక్కల కొనుగోలు కోసం ప్రభుత్వం దాదాపు రూ. 950 కోట్లు వెచ్చించడమే కాకుండా రవాణా, గోనె సంచులు, నిల్వ కోసం అదనంగా భారీ మొత్తంలో ఖర్చు చేసింది.

