29వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి షేక్ జావిద్ సంచలన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి (సీపీఎం) పై 1,076 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించి, ఈ ఎన్నికల్లోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు.
ఒక్క ఓటుతో గెలుపు
అదే సమయంలో 18వ వార్డులో ఉత్కంఠభరిత పోరు సాగింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి, అత్యల్ప మెజారిటీతో గెలిచిన అభ్యర్థిగా నిలిచారు.


