
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని రెస్టోబార్లు మరియు కేఫీల రూపురేఖలు మారిపోతున్నాయి. కేవలం రుచికే ప్రాధాన్యత ఇచ్చే రోజులు పోయి.. ఇప్పుడు ఆరోగ్యంతో కూడిన విలాసానికి (Healthy Luxury) ప్రాధాన్యత ఇస్తున్నారు.
నయా ట్రెండ్ విశేషాలు:
-
చీనీకి స్వస్తి – మాంక్ ఫ్రూట్ కు జై: పంచదార వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను గుర్తించిన నగరవాసులు.. ఇప్పుడు షుగర్ బదులు సహజ సిద్ధమైన మాంక్ ఫ్రూట్ (Monk Fruit) మరియు స్టివియా (Stevia) వాడిన డెజర్ట్స్ మరియు డ్రింక్స్‌ను కోరుకుంటున్నారు.
-
గట్-హెల్త్ మంత్రం: జీర్ణక్రియను మెరుగుపరిచే మరియు మెదడును చురుగ్గా ఉంచే మ్యాచ్ (Matcha) టీ మరియు ఇతర గట్-హెల్త్ డ్రింక్స్‌కు డిమాండ్ భారీగా పెరిగింది.
-
మందు లేని మత్తు (Mocktails): ఆల్కహాల్ లేకుండానే కాక్టెయిల్ రుచిని ఇచ్చే ‘జీరో-ప్రూఫ్’ డ్రింక్స్‌ను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవి చూడటానికి కలర్ ఫుల్‌గా ఉండటమే కాకుండా హ్యాంగోవర్ సమస్య లేకుండా చేస్తున్నాయి.
-
ఇన్స్టాగ్రామ్ క్రేజ్: కేవలం రుచి మాత్రమే కాదు.. చూసేందుకు ‘Eye-Catchy’గా ఉండే సమ్మర్ కూలర్స్ ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్ (Insta Reels) మరియు స్టోరీల కోసం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

