
నల్గొండ: జిల్లాలో యాసంగి (రబీ) సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఊపందుకుంది. రైతులు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
తాజా గణాంకాలు:
-
కేంద్రాల ఏర్పాటు: జిల్లా వ్యాప్తంగా మొత్తం 422 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 166 కేంద్రాలలో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి.
-
ధాన్యం రాక: వివిధ కొనుగోలు కేంద్రాలకు (I K P, PACS) ఇప్పటివరకు 1,42,995 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
-
సేకరణ వివరాలు: ఇప్పటివరకు 154 మంది రైతుల నుంచి ₹3.44 కోట్ల విలువైన 1,440 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు.
-
మద్దతు ధర: క్వింటా గ్రేడ్-ఏ ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

