
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంలో కీలక ప్రక్షాళన చేపట్టింది. పలువురు ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలు మే 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి.
ముఖ్యమైన బదిలీలు మరియు పోస్టింగ్స్:
-
బి. సుమతి (మల్కాజిగిరి సీపీ): ప్రస్తుతం ఎస్ఐబీ (SIB) ఐజీపీగా ఉన్న బి. సుమతిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా నియమించారు.
-
డాక్టర్ తరుణ్ జోషి (‘ఫ్యూచర్ సిటీ’ సీపీ): సుధీర్ బాబు పదవీ విరమణ చేయడంతో, ప్రతిష్టాత్మక ‘ఫ్యూచర్ సిటీ’ పోలీస్ కమిషనర్గా తరుణ్ జోషి బాధ్యతలు చేపట్టనున్నారు.
-
శిఖా గోయల్ (హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ): సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆమె సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ ల్యాబ్ అదనపు బాధ్యతలను కూడా కొనసాగిస్తారు.
-
దేవేంద్ర సింగ్ చౌహాన్: విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ అయ్యారు.
-
అవినాష్ మహంతి: డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా బదిలీ కాగా, ఏసీబీ (ACB) డైరెక్టర్ అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తారు.
-
షాహ్నవాజ్ ఖాసిం: మల్టీ జోన్-2 ఐజీపీగా నియమితులయ్యారు. వీరికి పర్సనల్ ఐజీపీ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
-
కార్తికేయ: ఐజీపీ ఇంటెలిజెన్స్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

