
భువనగిరి శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది. హాస్టల్ సమీపంలోని ఫాంపాండ్లో ఈతకు వెళ్లిన బాలఆకాష్ (16) అనే విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాల సిబ్బంది పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘోరం జరిగిందని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భువనగిరి ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. మరో విద్యార్థి అస్వస్థతకు గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

