చెరువుల ఆక్రమణలపై నల్గొండ కలెక్టర్ సీరియస్: వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం


నల్గొండ జిల్లాలో చెరువులు, కుంటల కబ్జాలపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లోని ఆక్రమణలను గుర్తించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని, నిఘా పెంచాలని స్పష్టం చేశారు.