మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల అక్రమాలపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు!

నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు – విద్యార్థుల ఆరోపణలు:

  • భారీగా అక్రమాలు: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత అక్రమంగా జరిగిందని చైర్మన్‌కు వివరించారు.

  • రోస్టర్ విధానం బహీష్కరణ: ఉద్యోగాల భర్తీలో ఖచ్చితంగా పాటించాల్సిన ప్రభుత్వ రోస్టర్‌ విధానాన్ని పూర్తిగా పక్కనబెట్టేసి, అర్హత లేని వారికి పోస్టులను భారీ మొత్తానికి అమ్ముకున్నారని విద్యార్థి నాయకులు తీవ్రంగా ఆరోపించారు.

  • ఏజెన్సీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి: ఈ అక్రమ నియామకాలకు కారణమైన సదరు ఔట్‌సోర్సింగ్ కన్సల్టెన్సీ/ఏజెన్సీని తక్షణమే ప్రభుత్వ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని వారు డిమాండ్ చేశారు.