నల్గొండ పంట సర్వేకు వాలంటీర్ల నియామకం: అగ్రికల్చర్ అభ్యర్థులకు అవకాశం | Nalgonda Crop Survey 2026


నల్గొండ జిల్లాలో యాసంగి పంటల నమోదు కోసం డిజిటల్ సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. గ్రామానికి ఒక వాలంటీర్‌ చొప్పున అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తూ నియామకాలు చేపట్టనుంది. జిల్లా వ్యాప్తంగా 5.66 లక్షల ఎకరాల పంట వివరాల సేకరణే లక్ష్యంగా ఈ నెలాఖరు నుంచి సర్వే ప్రారంభం కానుంది.