నల్లగొండ ఎన్నికల ఖర్చులో చేతివాటం: ఆడిట్ లేకపోవడంతో లక్షల రూపాయల దుర్వినియోగం?


నల్లగొండ జిల్లాలో ఎన్నికలు ముగిసిన తరుణంలో ఖర్చుల లెక్కలపై దుమారం రేగుతోంది. సరైన ఆడిట్ వ్యవస్థ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు అధికారులు ఎన్నికల నిర్వహణ నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనూ భారీగా ఖర్చులు పెంచి చూపిన ఉదంతాలు ఉండటంతో, తాజా ఎన్నికల వ్యయంపై పారదర్శకత కరువైందని సర్వత్రా చర్చ జరుగుతోంది.