నల్లగొండలో న్యాయవాది ఇంటిపై దుండగుల దాడి: విధులను బహిష్కరించి లాయర్ల భారీ నిరసన!

నల్లగొండ జిల్లా కేంద్రంలో న్యాయవాది జి. నరేష్ నివాసంపై జరిగిన దాడిని నిరసిస్తూ నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు భారీ ఆందోళన చేపట్టారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కోర్టు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా నేతలు ప్రభుత్వాన్ని కోరారు.