
నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. యూరియా కొనుగోలు కోసం ప్రవేశపెట్టిన నూతన యాప్ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఎరువులు పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధుల ఎగవేతపై కూడా ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

