
తెలంగాణ క్రీడా చరిత్రలో సరికొత్త మైలురాయిగా నిలుస్తున్న సీఎం కప్ 2025 (రెండో ఎడిషన్) రాష్ట్ర స్థాయి ఫైనల్స్ హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఈ వేడుకను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో గెలిచిన 21,500 మంది అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్లో తమ ప్రతిభను చాటుకోనున్నారు.

