విద్యాశాఖ కీలక నిర్ణయం: 200 పాఠశాలల్లో కంప్యూటర్ల రిపేర్లకు కోటేషన్ల ఆహ్వానం!

నల్లగొండ జిల్లాలోని 200 ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఐఎఫ్‌పీ (IFP) స్క్రీన్ల మరమ్మతుల కోసం సమగ్ర శిక్షా విభాగం టెండర్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 23 నుండి మార్చి 2వ తేదీలోపు డీఈఓ (DEO) కార్యాలయంలో కోటేషన్లు సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి సూచించారు.