
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ (Farmer Registry) ప్రక్రియకు గడువు సమీపిస్తోంది. నల్లగొండ జిల్లాలో పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన 5.54 లక్షల మంది రైతులకు గానూ, ఇప్పటివరకు కేవలం 2.41 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (Farmer ID) ఇచ్చే ఈ ప్రక్రియను మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు కోరుతున్నారు.

