మిర్యాలగూడ మున్సిపల్ పీఠంపై ‘హస్తం’ జెండా: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వ్యూహం సూపర్ హిట్!
మిర్యాలగూడ (ప్రజాలహరి): మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రభంజనాన్ని చాటింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 48 వార్డులకు గాను 31 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించి, పట్టణంలో పార్టీ పట్టును మరోసారి నిరూపించారు.
వ్యూహాత్మక అడుగులు.. తిరుగులేని విజయాలు
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు 20 రోజుల ముందే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రంగంలోకి దిగారు. కేవలం సర్వే రిపోర్టుల ఆధారంగా, క్షేత్రస్థాయిలో బలం ఉన్న వారికే టికెట్లు కేటాయించి సంచలనం సృష్టించారు.
-
వన్ మ్యాన్ షో: పార్టీలో కొందరు అసమ్మతి వ్యక్తం చేసినా, తన అంచనాలే నిజమని గెలుపు గుర్రాలను బరిలోకి దింపి లక్ష్మారెడ్డి నిరూపించారు.
-
బలం పెరిగింది: 31 సీట్లు కాంగ్రెస్ గెలవగా, ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా ఎమ్మెల్యే మద్దతుదారుడే కావడంతో కాంగ్రెస్ బలం 32కు చేరింది.
-
తృటిలో తప్పిన సీట్లు: మరో 5 స్థానాల్లో కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో ఓడిపోయిందని, లేదంటే ఈ సంఖ్య ఇంకా పెరిగేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి దృష్టిలో ప్రత్యేక గుర్తింపు
ఈ విజయం కేవలం స్థానికంగానే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిర్వహణలో, అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యే అనుసరించిన తీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది.
చైర్మన్ పీఠం ఎవరికి?
వచ్చే 16వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనం కానుంది. అయితే, ఆ అదృష్టవంతులు ఎవరనేది ఇప్పుడు మిర్యాలగూడలో ఉత్కంఠ రేపుతోంది.
“భక్తుడి కోరిక భగవంతుడికి ఎలా తెలుస్తుందో.. చైర్మన్ ఎవరనేది ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మనసులో ఏముందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.”
అప్పటివరకు కార్యకర్తలు, ఆశావహులు వేచి చూడాల్సిందే!

