
మెన్లో పార్క్: ‘ప్రైవసీకి ప్రాధాన్యత’ అంటూ మెటా ప్రచారం చేసిన స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకున్నాయి. AI శిక్షణ (AI Training) పేరుతో ఈ గ్లాసెస్ సేకరిస్తున్న డేటాలో వినియోగదారుల అనుమతి లేకుండానే వారి వ్యక్తిగత జీవితం బయటి వ్యక్తులకు కనిపిస్తోంది.
పరిశోధనలో తేలిన ముఖ్యాంశాలు:
-
కేన్యాలో రివ్యూ: మెటా తన AI మోడల్స్ మెరుగుపరచడానికి కేన్యాలోని ‘Sama’ అనే థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ సంస్థకు ఈ రికార్డింగ్‌లను పంపిస్తోంది. అక్కడ వందలాది మంది సిబ్బంది ఈ వీడియోలను చూసి వాటికి ట్యాగింగ్ (Data Annotation) చేస్తున్నారు.
-
ఏం కనిపిస్తున్నాయి?: రివ్యూవర్ల వద్దకు వెళ్తున్న వీడియోలలో ప్రజలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు (Nudity), బెడ్రూమ్ మసాజ్‌లు, బాత్రూమ్ సందర్శనలు మరియు శృంగార దృశ్యాలు ఉన్నట్లు సిబ్బంది స్వయంగా వెల్లడించారు.
-
బ్యాంక్ వివరాలు: వినియోగదారులు తమ క్రెడిట్/డెబిట్ కార్డులను చూస్తున్నప్పుడు లేదా ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు గ్లాసెస్ వాటిని రికార్డ్ చేసి రివ్యూవర్లకు పంపించాయి.
-
విఫలమైన బ్లర్ టెక్నాలజీ: ముఖాలను, వ్యక్తిగత సమాచారాన్ని బ్లర్ (Blur) చేసే సాఫ్ట్వేర్ సరిగ్గా పనిచేయకపోవడంతో వ్యక్తుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సిబ్బంది తెలిపారు.
-
క్లాస్ యాక్షన్ దావా: ఈ వ్యవహారంపై అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో మెటాపై క్లాస్ యాక్షన్ లాసూట్ (Class Action Lawsuit) నమోదైంది. మెటా ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు.
మెటా వివరణ: ఈ ఆరోపణలపై మెటా స్పందిస్తూ.. వినియోగదారులు స్వయంగా ‘AI ఇంప్రూవ్మెంట్’ ఆప్షన్‌ను ఎంచుకున్నప్పుడు మాత్రమే డేటా సేకరిస్తామని, అందులోనూ గోప్యత పాటిస్తామని చెప్పుకొచ్చింది. అయితే, చాలామంది వినియోగదారులకు తమ డేటా మానవ రివ్యూవర్ల (Human Reviewers) దగ్గరకు వెళ్తుందనే విషయం తెలియదని టెక్ నిపుణులు చెబుతున్నారు.

