← news.miryalaguda.co.in
‹ Monday, 12 October 2026 ›
No. 6

The Miryalaguda Chronicle

Digital Edition
Monday, 12 October 2026 Digital Edition Page 1 of 1
లోకల్ న్యూస్

వినియోగదారులకు చైతన్యం కలిగించాలి: డిసిఎస్ఓ వెంకటేష్

నల్లగొండ: వినియోగదారులకు చైతన్యం కలిగించడానికి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి టి.వెంకటేష్ కోరారు.

  సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని డీసీఐసీ కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ సమావేశం ఎన్.డి.సి.సి.సి. జిల్లా అధ్యక్షులు అన్నెబోయిన మట్టయ్య అధ్యక్షతన జరిగింది.

    ముఖ్యఅతిథిగా హాజరైన డిసిఎస్ఓ టి.వెంకటేష్ మాట్లాడుతూ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు సహకారం అందిస్తామని వివరించారు.

     తూనికలు కొలతలు శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ వినియోగదారుల సంఘాల ప్రతినిధులు ప్రజల్లో అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

   జిల్లా డ్రగ్ ఇన్ స్పెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న సంఘాల ప్రతినిధులను అభినందించారు.

    క్యాట్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వినియోగదారుల సొసైటీలకు సంక్షేమ నిధి కోసం నీతి రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించారు.

   అనంతరం జిల్లా మాజీ అధ్యక్షుడు స్వర్గీయ ఎ.హిమగిరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు.
ఈ సమావేశంలో డిసిఐసి జిల్లా కన్వీనర్లు చింతమల్ల గురవయ్య, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, కొడారి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట మనోహర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.అస్మా, మహ్మద్ ముస్తఫా, జిల్లా సహాయ కార్యదర్శి పసునూరి రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ దువ్వ గీత, మిర్యాలగూడ డివిజన్ కన్వీనర్ సిహెచ్. సాంబశివరావు, చండూరు డివిజన్ కన్వీనర్ గండూరి నర్సింహ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు జూలూరు వెంకటేశం, తాందారి యాదయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పోచం సోమయ్య, ప్రతినిధులు పి.కవిత, వి.వాణిశ్రీ, సీతారాములు, హరి, పాషా, తదితరులు పాల్గొన్నారు.

Andhra Pradesh

ఇథనాల్ పెట్రోల్ విధానంపై పునరాలోచన చేయాలి : సెమినార్ లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు 

ఇథనాల్‌ను కలిపి వినియోగించే విధానంపై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకనే ఆహార భద్రత విధానంలో ప్రతిష్టంభన ఏర్పడిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.

ఆదివారం స్థానిక అనుధితి ఫంక్షన్ హాల్‌లో రైతు సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన *”భారత దేశంలో ఆహార భద్రతపై ఇథనాల్ విధాన ప్రభావం”* అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు.

వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇథనాల్ వినియోగం ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం వంటి లక్ష్యాలు ఉన్నప్పటికీ, ఈ విధానం వల్ల రైతులకు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌కు, ఆహార భద్రతకు కలిగే ప్రభావాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తే పెరుగుతున్న డిమాండ్ ఆ పంటలను సాగు చేసే రైతులకు అదనపు మార్కెట్ అవకాశాలను కల్పించవచ్చు. అయితే, ఇథనాల్ ఉత్పత్తి కోసం వ్యవసాయ పంటల వినియోగం పెరిగినప్పుడు ఆహార అవసరాలు, పశుగ్రాస లభ్యత, పంటల ధరలు, సాగునీటి వినియోగంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు.

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం అనేది కేవలం ఇంధనానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఇది వ్యవసాయ ఉత్పత్తి, రైతుల ఆదాయం, ఆహార భద్రత, భూగర్భ జలాలు, పర్యావరణం, దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న విధానమని తెలిపారు.

ప్రభుత్వం ఇథనాల్ విధానంపై స్వతంత్ర నిపుణుల కమిటీతో సమగ్ర అధ్యయనం చేయించి, రైతు సంఘాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు, వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

రైతు సంఘం జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొతినేని సుదర్శన్ మాట్లాడుతూ – ఇంధన అవసరాల కోసం వ్యవసాయాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ వ్యవసాయాన్ని కేవలం ఇంధన ముడిపదార్థాల సరఫరా రంగంగా మార్చకుండా, రైతుల జీవనోపాధిని మరియు దేశ ఆహార భద్రతను కాపాడటం ప్రభుత్వ విధానంలో ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు.

నవంబర్ 15 నుండి 18వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే 36వ జాతీయ రైతు సంఘం మహాసభ జరగనుందని, దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు ఆ మహాసభలకు హాజరు కానున్నారని, మహాసభలను విజయవంతం చేయాలని వారు కోరారు.

సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, ఆదర్శ రైతు జొన్నలగడ్డ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.