
ముఖ్యమంత్రి విజ్ఞప్తి – ప్రధానాంశాలు:
-
మెట్రో ఫేజ్-2 ఆమోదం: ఏడు కారిడార్లతో కూడిన మెట్రో రెండో దశకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) ఇప్పటికే కేంద్రానికి సమర్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
-
జాయింట్ వెంచర్: ఈ ప్రాజెక్టును కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం (Joint Venture) కింద చేపట్టేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
-
మెట్రో ఫేజ్-1 స్వాధీనం: విస్తరణ పనులు సజావుగా సాగాలనే ఉద్దేశంతో ఎల్అండ్టీ ఎంఆర్హెచ్ఎల్ (L&T MRHL) పరిధిలోని మెట్రో ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని వివరించారు.
-
ఫేజ్-3 ప్రతిపాదన: శంషాబాద్ విమానాశ్రయం (RGIA) నుండి భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్ వరకు మెట్రో మూడో దశగా చేపట్టాలని కోరుతూ, దానికి సంబంధించిన డీపీఆర్‌ను కూడా అందజేశారు.

