
‘అబ్‌కీ బార్ తెలంగాణ’ – ప్రధాని మోదీ ప్రసంగ ముఖ్యాంశాలు:
-
విజయ నినాదం: ‘అబ్‌కీ బార్ తెలంగాణ’ (ఈసారి తెలంగాణలో బిజెపి ప్రభుత్వం) అంటూ ప్రధాని సభికులతో నినాదాలు చేయించారు. తెలంగాణలో బిజెపి వైపు గాలి మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
-
తెలంగాణతో అనుబంధం: బిజెపికి దేశవ్యాప్తంగా కేవలం రెండు ఎంపీ సీట్లు ఉన్న కాలంలోనే ఒకటి తెలంగాణ నుంచి వచ్చిందని, బిజెపి చరిత్రలో ఈ గడ్డకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు.
-
బెంగాల్ విజయం ప్రభావం: పశ్చిమ బెంగాల్‌లో బిజెపి సాధించిన చారిత్రక విజయం తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తోందని, నియంతృత్వ, కుటుంబ రాజకీయాలపై ప్రజలు తీర్పునిస్తున్నారని చెప్పారు.
-
కాంగ్రెస్, బిఆర్ఎస్ పై విమర్శలు: కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకు కేంద్రంగా మారిందని, అబద్ధపు హామీలతో ప్రజలను వంచిస్తోందని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ రాజకీయాల పట్ల తెలంగాణ ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు.
-
సుపరిపాలన మోడల్: అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో బిజెపి సుపరిపాలనను చూసి ప్రజలు మళ్లీ మళ్లీ అధికారాన్ని కట్టబెడుతున్నారని, అదే తీర్పు తెలంగాణలోనూ పునరావృతం కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

