FCI గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం – కీలక రికార్డులు దగ్ధం.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ప్రస్తుతం ఒకే ఒక ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉండటంతో మంటలను అదుపు చేయడం సిబ్బందికి సవాలుగా మారింది. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి అధికారులు శ్రమిస్తున్నా ఇంకా అదుపులోకి రావడం లేదు. ఎఫ్‌సీఐ గోడౌన్‌ పరిధిలో పొగ వ్యాపించడంతో ఊపిరి ఆడక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.