
సంక్షేమ పథకాలు – ధాన్యం కొనుగోళ్లలో జిల్లా రికార్డు:
-
రాష్ట్రంలోనే అగ్రస్థానం: జిల్లా వ్యాప్తంగా మొత్తం 931 మహిళా సంఘ భవనాల (SHG Buildings) ఏర్పాటు ప్రక్రియ సాగుతోందని, ఈ భవనాల నిర్మాణంలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు.
-
ధాన్యం కొనుగోళ్లు: యాసంగి ధాన్యం కొనుగోళ్లలోనూ నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 7.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినట్లు వివరించారు.
-
సాదాబైనామా దరఖాస్తులు: గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న సాదాబైనామా (భూముల క్రమబద్ధీకరణ) దరఖాస్తులను త్వరితగతిన త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
తరుగు పేరిట దోపిడీ – కలెక్టర్ సమగ్ర విచారణ ఆదేశం:
-
రైతుల ఫిర్యాదు: ఆమనగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్పీఓ (FPO) ధాన్యం కొనుగోలు కేంద్రంలో మిల్లుల యజమానులు, నిర్వాహకులు బస్తాకు సుమారు 4 కిలోల వరకు ‘తరుగు’ తీస్తూ తూకాల్లో మోసం చేస్తున్నారని, దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక రైతులు కలెక్టర్, ఎమ్మెల్యేల దృష్టికి తెచ్చారు.
-
కఠిన చర్యలు: రైతుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన కలెక్టర్ చంద్రశేఖర్.. ధాన్యం తరుగు వ్యవహారంపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక అందించాలని స్థానిక రెవెన్యూ (ఆర్వో) అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

