
నల్లగొండ జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాలక వర్గాల ఏర్పాటు తర్వాత ఇప్పుడు ‘కోఆప్షన్ సభ్యుల’ ఎంపిక ప్రక్రియ హాట్ టాపిక్‌గా మారింది. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములయ్యే ఈ పదవుల కోసం గత ఎన్నికల్లో టికెట్ రాని నేతలు, పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న తరుణంలో, అధిష్టానం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

