
తెలంగాణలో ఇంధన పొదుపు మరియు ఇంధన సామర్థ్య (Energy Efficiency) ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు TGREDCO ఒకే ఒక్క రోజు “ఇన్వెస్ట్మెంట్ బజార్” కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తోంది. ప్రాజెక్ట్ డెవలపర్లు, ఫైనాన్షియల్ సంస్థలు మరియు ఇన్వెస్టర్లను ఒకే చోటికి చేర్చి, కోట్లాది రూపాయల నిధుల సమీకరణకు ఈ వేదిక మార్గం సుగమం చేయనుంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఇంధన ప్రాజెక్టులకు చేయూతనివ్వడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

