
దేవరకొండ: రంగుల పండుగ హోలీ వేళ నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్నేహితులతో కలిసి బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో కార్తికేయన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పండుగ పూట ఈ వార్త తెలియడంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.
ఘటన వివరాలు: హోలీ ఆడేందుకు కార్తికేయన్ తన స్నేహితుడు శ్రీనివాసచారితో కలిసి బైక్పై బయలుదేరారు. దేవరకొండ పట్టణంలోని ఉప్పవాగు సమీపంలో బైక్ వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్తికేయన్ తలకు తీవ్రమైన గాయం కావడంతో భారీగా రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ కార్తికేయన్ మరణించాడు.
మరో విద్యార్థి శ్రీనివాసచారి ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. అతని పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

