Andhra Pradesh
పట్టపగలు దొంగల హల్చల్
నల్లగొండజిల్లా వేములపల్లి మండల కేంద్రంలో పట్టపగలే దొంగలు నారాయణ శేఖర్ రెడ్డి అను అతని ఇంట్లో సుమారు 28 తులాల బంగారం, మూడు లక్షల నగదు, వెండి దొంగిలించినట్టుగా శేఖర్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, దీంతో పోలీసులు క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు. అంతేకాకుండా వేములపల్లి వరుస దొంగతనాలు జరుగుతున్నప్పటికిని ఇట్టి విషయంపై విచారణ చేపడుతున్నట్టుగా స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.



