← news.miryalaguda.co.in
‹ Monday, 5 October 2026 ›
No. 1

The Miryalaguda Chronicle

Digital Edition
Monday, 5 October 2026 Digital Edition Page 1 of 1
లోకల్ న్యూస్

పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలి

కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జులకు సూచించిన చిలుకూరి సుధా బాలకృష్ణ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడ పట్టణంలోని పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియను విజయవంతం చేయడమే లక్ష్యంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జులతో సమావేశం నిర్వహించారు.మున్సిపల్ కౌన్సిలర్ చిలుకూరి సుధా బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పట్టణంలోని ప్రతి వార్డులో అర్హత కలిగిన పట్టభద్రులను గుర్తించి, వారి ఓటు నమోదు ప్రక్రియ సక్రమంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు.ప్రతి కౌన్సిలర్, వార్డు ఇంచార్జి తమ పరిధిలోని పట్టభద్రులను గుర్తించి, ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని చిలుకూరి సుధా బాలకృష్ణ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జులు, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

 

లోకల్ న్యూస్

మిర్యాలగూడలో ఘనంగా జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్ విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేసిన ప్రజాప్రతినిధులు

మిర్యాలగూడ పట్టణంలోని బీసీ భవన్‌లో నల్గొండ డిస్ట్రిక్ట్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ , వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ , మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR తనయులు, యువ నాయకులు బత్తుల ఈశ్వర్ గణేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు సోమగాని చంద్రకళ, గొట్టిముక్కల ఝాన్సీ లక్ష్మణ్ కార్యక్రమంలో పాల్గొని యోగాసన పోటీలను వీక్షించారు.ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ప్రజాప్రతినిధులు బహుమతులు మరియు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.యోగాసనం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రతను పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరమని, చిన్నారులు, యువత యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని వారు సూచించారు. జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందిస్తూ, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నల్గొండ డిస్ట్రిక్ట్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో యోగాసన అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు