← news.miryalaguda.co.in
‹ Tuesday, 6 October 2026 ›
No. 2

The Miryalaguda Chronicle

Digital Edition
Tuesday, 6 October 2026 Digital Edition Page 1 of 1
Andhra Pradesh

సిఇసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి, ఎస్ఐఆర్ ను నిలిపివేయాలి

కమిషన్ నియమాకాన్ని పాత పద్ధతిలో ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ నాయకులు పూన్న కైలాస్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, పన్నాల గోపాల్ రెడ్డి తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు, మరియు ఇందూర్ సాగర్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈరోజు డైట్ కళాశాల నుండి నల్లగొండ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించినారు. ఈ సందర్భంగా పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్లేటో తత్వవేత్త చెప్పినట్లు ఒక మూర్ఖుడికి అధికారం లభించినప్పుడు అతడు చేసే మొదటి పని జ్ఞానుల గొంతు నొక్కడం ఆ తరువాత చేసే పని తన చుట్టూ ఇతర మూర్ఖులను చేర్చుకోవడం చివరికి అతడు చేసే పని దేశాన్ని నాశనం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మన దేశ పాలన విధానం ఈ విధంగా ఉన్నది అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన నాగేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు పాపయ్య,జగన్నాథం, నాయుడు,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Andhra Pradesh

కొంగరకలాన్‌లో అఖిలపక్ష మహా ధర్నా

కొంగరకలాన్‌లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, శ్రీమతి చీగిరింత పారిజాత నరసింహారెడ్డి  ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన అఖిలపక్ష   కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ , కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి , కంటెస్టెడ్ ఎమ్మెల్యే భీమ్ భరత్  పాల్గొన్నారు,

మీర్పేట్ 60వ డివిజన్ అధ్యక్షులు చల్లా బాల్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పైల శేఖర్ రెడ్డి , కర్మన్‌ఘాట్ టెంపుల్ డైరెక్టర్ కొండ్ర సంతోష్ కుమార్ , రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా ఐత భాస్కర్ , మీర్పేట్ సోషల్ మీడియా బావోజు సిద్ధేశ్వర చారి , కోళ్ల పరుశురాం , సైదులు యాదవ్ , కుతాడి సుధాకర్ , రవీందర్ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Andhra Pradesh

ఇరిగేషన్ ఈఈ కేతావత్ నాగేశ్వర్ రావు మృతికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR సంతాపం

దామరచర్ల మండలం కేతావత్ తండాకు చెందిన ఇరిగేషన్ శాఖ ఈఈ కేతావత్ నాగేశ్వర్ రావు స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR వారి స్వగృహానికి వెళ్లి పార్ధివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు…అనంతరం వారి అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాడె మోసి తమ గౌరవాన్ని చాటుకున్నారు.అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొని కేతావత్ నాగేశ్వర్ రావు మృతికి సంతాపం తెలిపారు…