16 October 2026
Indian
Independent
Andhra Pradesh

సిఇసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి, ఎస్ఐఆర్ ను నిలిపివేయాలి, 

ఎన్నికల కమిషన్ నియమాకాన్ని పాత పద్ధతిలో ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ నాయకులు పూన్న కైలాస్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, పన్నాల గోపాల్ రెడ్డి తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు, మరియు ఇందూర్ సాగర్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈరోజు డైట్ కళాశాల నుండి నల్లగొండ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించినారు. ఈ సందర్భంగా పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్లేటో తత్వవేత్త చెప్పినట్లు ఒక మూర్ఖుడికి అధికారం లభించినప్పుడు అతడు చేసే మొదటి పని జ్ఞానుల గొంతు నొక్కడం ఆ తరువాత చేసే పని తన చుట్టూ ఇతర మూర్ఖులను చేర్చుకోవడం చివరికి అతడు చేసే పని దేశాన్ని నాశనం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మన దేశ పాలన విధానం ఈ విధంగా ఉన్నది అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన నాగేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు పాపయ్య,జగన్నాథం, నాయుడు,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More in Andhra Pradesh